జైపాల్ రెడ్డికి క్లాస్ పీకిన ప్రధాని మన్మోహన్ సింగ్

కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రధాని క్రీడోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. క్రీడాకారుల గైర్హాజరీ ఆందోళనకర విషయమేనన్నారు. క్రీడోత్సవ సన్నాహకాలపై గురువారం ఎంఎస్ గిల్, జైపాల్‌రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితరులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీకి ఆహ్వానం లేకపోవడంపై చౌహాన్ స్పందిస్తూ 'ప్రభుత్వ శాఖల అధిపతులతో ప్రధాని సమావేశమయ్యారు. ఆర్గనైజింగ్ కమిటీ ఆ విభాగంలోకి రాదు" అన్నారు.












Click it and Unblock the Notifications