అవినీతి సొమ్ముతో జగన్ టీవీ చానెల్, పత్రిక పెట్టారు: బాబు

మున్సిపల్ ఎన్నికలను కావాలనే ప్రభుత్వం ఆలస్యంగా జరుపుతోందని, ప్రత్యేకాధికారుల పాలనలో మున్సిపాలిటీలు మరింతగా దిగజారుతాయని ఆయన అన్నారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై 420 కేసును ఉపసంహరించుకోవడం ముఖ్యమంత్రి కె. రోశయ్య పిరికిపంద చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి మద్యం విచ్చలవిడి అమ్మకాల నియంత్రణ కోసం ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ వారు వ్యాపారాలు చేసుకోకుడదా అని ఆయన అడిగారు. తమ పార్టీవారు మద్యం విచ్చలవిడిగా అమ్మితే వారిపైనా తమ పోరాటం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్రలపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని, సమైక్యాంధ్రపై తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications