కొండా సురేఖపై, వైయస్ జగన్ వర్గీయులపై వేటు తప్పదా?

Konda Surekha
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖపై వేటు తప్పేట్లు లేదు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువారం చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ భూస్థాపితం అవుతుందనే కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసును భూస్థాపితం చేయడం ఎవరి వల్లా కాదని ఆయన అన్నారు. సురేఖపై సరైన సమయంలో చర్యలుంటాయని ఆయన అన్నారు. సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అది తనకు అందలేదని ఆమె చెబుతూ వస్తున్నారు. అయితే, ఈసారి పకడ్బందీగా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి కూడా పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అది తనకు అందలేదని ఆయన కూడా అంటున్నారు.

ఈ స్థితిలో కచ్చితంగా, కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సోనియా ఆదేశాల మేరకు డిఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి, సోనియాకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు. అలా మాట్లాడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన నాయకులపై చర్యలు తీసుకోవడానికే డిఎస్ ఈ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందరినీ పార్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించి, ఆ తర్వాత మాట విననివారిపై నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలనేది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.

ఆ కసరత్తంతా అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ చివరి వారంలో వైయస్ జగన్ వర్గీయులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులను తొలగించి కొత్త మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ వర్గీయులపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారు. అయితే, వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడానికి ముందు ఈ చర్యలన్నీ పూర్తి కావాలనేది పార్టీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వ్యవహారమంతా అక్టోబర్ నెలాఖరునాటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+