చిరంజీవిపై ప్రజారాజ్యం నేత భూమా నాగిరెడ్డి అసంతృప్తి

రాష్ట్రంలో అన్నిపార్టీలు అయోమయంలో ఉన్నాయన్నారు. ఒకప్పుడు వ్యక్తులను చూసి రాజకీయాలు నడిచేవని, నేడు డబ్బును చూసి నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు పరస్పరం విమర్శించుకోవడానికే సమయం సరిపోతోందని చెప్పారు. కాంగ్రెస్ నేతలేమో జగన్ జపానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్నారు. మంత్రి శిల్పా మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications