తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. తాము పరాయిపాలనలో జీవిస్తున్నట్లుగా తెలంగాణ వారు భావిస్తున్నారని ధర్నా సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. తాజాగా శ్రీనివాస్ గౌడ్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్లేపై చర్యలు తీసుకోకుండా శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవడాన్ని వారు ఖండించారు. సస్పెండ్ లు, ట్రాన్స్ ఫర్ లు చేస్తే ఉద్యోగులు భయపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోందని, కాని ఉద్యమానికి ఎవ్వరూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.