విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం: హోంమంత్రి సబితారెడ్డి

కేసు నమోదుపై చాలామంది అపోహ పడుతున్నారని, లక్షలమందిపై కేసులు ఉన్నట్టు భావిస్తున్నారని అది అవాస్తవమని చెప్పారు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కేవలం 1171 కేసుల్లో కేవలం 5374 మందిపైన కేసు నమోదయ్యిందని అన్నారు. రేపటినుండి కేసులు ఎత్తివేత ప్రక్రియ ప్రారంభమవుతుందని, దీనికి కనీసం రెండు నెలలు పడుతుందన్నారు. వీలైనన్ని కేసులు ఎత్తివేయాల్సిందిగా ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారని అన్నారు. బస్సులను తగలబెట్టడం వంటి తీవ్రమైన కేసులు తప్పితే అన్ని కేసులు ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీమాంధ్రలో 189 కేసులు, తెలంగాణలో 982 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల విడుదలను చర్చించినట్లు చెప్పారు. పక్క రాష్ట్రాలు, హత్యలు, కిడ్నాప్ లు, భారీ దొంగతనాలు వంటి వారిని పక్కన పెట్టి చిన్న చిన్న తప్పులు చేసిన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటానికి ప్రభుత్వం సిద్ధమయింది. అంతేకాకుండా ఏడేళ్ల జైలు శిక్ష పడి ఐదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మంచి ప్రవర్తన ఖైదీలను విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications