విశాఖలో ఎంబిఏ విద్యార్థి కిడ్నాప్: పిఎస్ లో కేసు నమోదు
Districts
oi-Srinivas G
By Srinivas
విశాఖపట్టనం: విశాఖపట్టనంలో మరో విద్యార్థి కిడ్నాప్ కు గురయ్యాడు. విశాఖపట్టనంలోని తగరపు వలసకు చెందిన విజయ్ కుమార్ అనే ఎంబిఏ విద్యార్థి తగరపువలస వద్ద కిడ్నాప్ కు గురయ్యాడు. తాను కిడ్నాప్ కు గురయినట్లు విజయ్ కుమార్ తన బంధువులకు సంక్షిప్త సమాచారాన్ని(మెసేజ్)ను పంపాడు. కిడ్నాప్ చేసిన వారిని చూస్తుంటే అవయవాలు కోసి అమ్మేవారిగా ఉన్నారంటూ అతను తన సోదరుడికి సైతం సంక్షిప్త సమాచారాన్ని పంపాడు. అతడి బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా అతను పంపిన సమాచారాన్ని బట్టి బాడీ ఆర్గాన్ కు చెందిన ముఠా కిడ్నాప్ చేసినట్లు పోలీసులు ఆనుమానిస్తున్నారు.