వరంగల్ : వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. గ్రామంలోని ఉపేందర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక డోర్నకల్ సీఐ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమంటూ ఉపేందర్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. సదరు యువకుడు ఇంటివద్ద నున్న పురుగుల మందును తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో యువకుడి ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతికి కారణమైన సిఐపై చర్యలు తీసుకోవాలని వారు గ్రామస్తులు కోరుతున్నారు. యువకుడికి తల్లి, భార్య, బిడ్డలు చనిపోయారు. పని నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వెళితే డబ్బులు అడిగినట్లు సమాచారం. డబ్బులు అడగటంతో పాటు వివిధ మాటలతో వేధింపులకు సైతం గురి చేసినట్లు సూసైడ్ నోట్ లో పెర్కొన్నాడు.