గద్దర్ ను కలుపుకొని పోతాం: ఎంపీ వివేక్

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలిసి పోరాడటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. గద్దర్ తోపాటు ఎవరు తెలంగాణ కోసం చిత్తశుద్దితో ముందుకు వచ్చినా కలుపుకొని పోతామని వివేక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అదిలాబాద్ లో జరిగే అమరవీరుల సభలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తాము జరుపుతున్న సభలు అధిష్టానం ఆమోదంతోనే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. వీరప్ప మొయిలీ, ప్రణభ్ ముఖర్జీలకు చెప్పి ఈ సభలు నిర్వహిస్తున్నామని, ఆర్ధిక సహాయానికి కూడా కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని వివేక్ చెప్పారు.












Click it and Unblock the Notifications