కృష్ణా జిల్లాలో గజదొంగ అడపా వెంకన్న్ ఎన్ కౌంటర్

Krishna District
విజయవాడ: అంతర్‌ జిల్లా గజదొంగ అడపా వెంకన్న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో కృష్ణా నది ఒడ్డున వెంకన్న మృతదేహం పడిఉంది. తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. ఇవాళ ముఖ్యమంత్రి రోశయ్య విజయవాడ పర్యటన సందర్భంగా తనిఖీలు చేస్తుండగా వెంకన్నతో పాటు, మరో వ్యక్తి తారసపడ్డారని, పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంకన్న తమపై కాల్పులు జరిపాడని, తిరిగి తాము ఎదురు కాల్పులు జరపడంతో వెంకన్న మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంఘటనా స్థలం నుంచి దేశవాళీ తుపాకీ, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకన్నపై సుమారు 70 వరకు కేసులు ఉన్నాయి. వెంకన్న గుంటూరు జిల్లా మంగళగిరివాసి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా హైదరాబాదులో కూడా అతను దొంగతనాలు చేశాడు. రెకీ నిర్వహించి అతను ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+