వైయస్ జగన్ పై హెచార్సీకి ఫిర్యాదు: ప్రాణభయం ఉందన్న రామదాసప్ప

పోలీసులకు చెప్పిన తర్వాత ప్రాణభయంతో హైదరాబాద్ చేరుకుని తల దాచుకుంటున్నట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని, తమ సంస్థ కార్యాలయంపై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయమని పోలీసులను ఆదేశించాలని, తన నుంచి సుధాకర్‌బాబు తీసుకున్న రూ. 50 లక్షలను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో కోరారు. సాక్షి దినపత్రిక సిబ్బంది ఆదివారం ఉదయం తాను పనిచేసే కార్యాలయానికి వచ్చి, దళిత మహిళనైన తనను దుర్భాషలాడారని వెంకటమ్మ సోమవారం మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాను పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి బెదిరించారని, తనను కులంపేరుతో పిలిచి తమ సంస్థలో చేరితే మంచి జీతం ఇస్తామని చెప్పారని, దాసప్పనాయుడుకి చావు తప్పదని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications