వైయస్ జగన్ ఓదార్పు యాత్రను నిషేధించండి: అంబటి రాంబాబు

పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో ఎవరూ మిగలరని ఆయన అన్నారు. పిసిసి గాంధీ భవన్ కార్యాలయం తప్పిదాల నిలయంగా గబ్బిలాల ఆవాసంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. పార్టీ విజయంలో ప్రస్తుతం సస్పెండ్ అయిన నాయకుల పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వణుకు పుట్టిస్తున్న ఓదార్పు యాత్రను అడ్డుకోవడం సరి కాదని, అలా అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని, అలా లాభం చేకూర్చడమే పిసిసి నాయకత్వం అభిమతమా అని ఆయన అన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన మధు యాష్కీ, వి హనుమంతరావులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఓదార్పు యాత్రలో పాల్గొన్నవారిపైనే చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. పరిస్థితి చూస్తుంటే వైయస్ జగన్ వ్యతిరేకులు తెలుగుదేశం పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కు దిగినట్లు అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తాను జగన్ అభిప్రాయాలను వెల్లడించడం లేదని, ఓ సీనియర్ కాంగ్రెసు నాయకుడిగా బాధతో మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. అయితే, జగన్ తో తాను ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications