హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుపై చంద్రబాబు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతికి ప్రధాన సూత్రధారి అయిన కేవీపీ రామచంద్రారావు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. కేవీపీపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేసిన తర్వాతే విచారణకు ఆదేశించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులపై విచారణకు ఆదేశిస్తే వారి అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమని సవాలు విసిరారు.

పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. 9వ తేదీన మద్యం నియంత్రణపై ఆందోళన ఉంటుందని, పదో తేదీ నుండి పల్లె పల్లెకు స్థానిక తెలుగుదేశం నాయకులు యాత్రలు చేపడతారని ఆయన అన్నారు. పల్లె బాటకు తెలంగాణలో ఆటంకాలు ఏర్పడితే ఈ నెల 20వ తేదీ నుంచి యాత్రలు ఉంటాయని ఆయన చెప్పారు. కాగా, చంద్రబాబు నెలకు నాలుగు జిల్లాల చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X