ఏలూరు: పశ్సిమ గోదావరి జిల్లాలో చేపల ధర 5 రూపాయలకు పడిపోయింది. అక్కడి ప్రాంతంలో వాతావరణం బాగా ముసురుగా ఉండటంతో సముద్రంలో చేపలు బాగా తేలియాడటంతో చేపల ధర క్రమంగా పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాతావరణం అనుకూలంగా లేక చల్లబడటంతో సముద్రంలో ఆక్సిజన తగ్గిపోయింది. అక్సిజన్ తగ్గిపోతే చేపలు పైకి వస్తాయి. పెద్ద మొత్తంలో చేపలు తేలడంతో చేపలకు రేటు పడిపోయింది. టన్నుల కొద్ది చేపలు పైకి తేలాయి. మత్స్యకారులు వాటిని సేకరించి తక్కువ ధరకు అమ్మారు. ఈ కారణంగా తాము లక్షలు నష్టపోయామని వారు వాపోతున్నారు.