రోశయ్యతో పాటు కేశవరావుకూ సోనియా ఢిల్లీ పిలువు

రోశయ్య ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. 11వ తేదీన ఆయన సోనియాను కలుస్తారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారశైలిపై చర్చ జరుగుతుందని, అందుకు పార్టీ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడి రోశయ్య సలహాలు తీసుకుంటారని అంటున్నారు. పిసిసి అధ్యక్షడి నియామకం కూడా జరగాల్సి ఉంది. తెలంగాణ అంశం పెండింగులోనే ఉంది. దాని పరిష్కారానికి డిసెంబర్ తర్వాత కూడా కొంత సమయం కాంగ్రెసు అధిష్టానానికి దక్కుతుంది.
ఈ స్థితిలో తెలంగాణ సమస్య పరిష్కారానికి అనుగుణంగా సర్గుబాట్లు, ఏర్పాట్లు చేయడానికే కేశవరావును ఢిల్లీకి పిలిపిస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులకు దాదాపుగా కేశవ రావు నాయకత్వం వహిస్తున్నారు. అందువల్ల ఆయనతో చర్చించాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, కేశవరావు ఇటీవలి కాలంలో అధిష్టానం విశ్వాసాన్ని చూరగొన్నారు.












Click it and Unblock the Notifications