సాక్షి టీవీ చానెల్ కథనంపై తిరగబడిన గిరిజన మహిళ

చంద్రబాబు తనను కొట్టలేదని, సాక్షి తప్పుగా వార్తను ప్రసారం చేసిందని ఆమె అన్నారు. కూర్చోవాల్సిందిగా తనకు చంద్రబాబు సూచన చేశారని ఆమె చెప్పారు. సాక్షి దినపత్రిక తప్పుడు వార్తలను ప్రసారం చేయడం సరి కాదని ఆమె అన్నారు. చంద్రబాబు మంచి మాటల వల్లనే తాము బాగున్నామని ఆమె చెప్పారు. కాగా, చంద్రబాబు కూడా సాక్షిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
స్టూడియో ఎన్ లక్ష్మి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. చంద్రబాబు సమావేశంలోకి వైయస్ జగన్ వర్గీయులు ప్రవేశించారని, గొడవ చేయడానికి ప్రయత్నించారని ఆ చానెల్ చెప్పింది. గొడవ చేయడం కుదరకపోవడంతో గిరిజన మహిళలు చంద్రబాబుపై తిరగబడ్డారంటూ సాక్షి తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వివరించింది. అక్రమాస్తులను కాపాడుకోవడానికి సాక్షి దొంగకథనాలను ప్రసారం చేస్తోందని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications