టీవీ లైవ్ షోలో రఘుమారెడ్డిపై చేయి చేసుకున్న తెరాస నేత సుమన్

రఘుమారెడ్డి తెలంగాణ కోసం మరణించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను వెంట పెట్టుకుని టీవీ లైవ్ షోకు వచ్చారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అంతకు ముందే తెరాస నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస నాయకుల వల్లనే తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. తెరాస ఇచ్చిన చెక్కులు చెల్లలేదంటూ శుక్రవారం తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ధర్నా కూడా చేశాయి. ఈ వాతావరణంలో టీవీ చానెల్ లో సుమన్ కు, రఘుమారెడ్డికి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ వివాదంలో సుమన్ రఘుమారెడ్డిపై చేయి చేసుకున్నారు. ఇద్దరూ కొట్టుకున్నారు. ఇది ఎన్టీవిలో జరిగింది.












Click it and Unblock the Notifications