ఆంధ్రజ్యోతి డైలీపై అగ్గి మీద గుగ్గిలమైన కె. చంద్రశేఖర రావు

సూక్ష్మరుణ సంస్థల కబంధహస్తాల్లో చిక్కుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అసలు తెలంగాణ బతుకే ఆత్మహత్యల బతుకయ్యిందని, రైతులు, చేనేతలు, విద్యార్థులు, అప్పులుతీసుకున్న పేదలూ ఆత్మహత్య చేసుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. వరంగల్‌లో కొద్ది రోజుల క్రితం సూక్ష్మరుణ సంస్థల వేధింపులకు తట్టుకోలేక మౌనిక అనే విద్యార్థి ఆత్మహత్యచేసుకున్నారని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని, మైక్రోఫైనాన్సుల బారినుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలంటూ కొందరు మహిళలు, బాలికలు ప్లకార్డులతో కేసీఆర్ ముందుకు వచ్చారు. సూక్ష్మరుణ సంస్థల వద్ద పేదలు తీసుకున్న రుణాలపై మారటోరియం విధించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనకొకటి గుర్తుకొస్తున్నదంటూ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తీరును ఆయన గుర్తు చేశారు. 54 ఏండ్లలో ఆంధ్రావాళ్ళు ఎప్పుడన్నా బతుకమ్మ ఆడారని, కానీ ఇప్పుడు విజయవాడలో బతుకమ్మ ఆడుతున్నామని లగడపాటి అంటున్నాడని, విజయవాడలో కాదు.. కనీసం హైదరాబాద్‌లో 30, 40 ఏండ్ల నుంచి ఉంటున్న ఆంధ్రావాళ్ళన్నా ఎప్పుడన్నా బతుకమ్మ ఆడారా అని కేసీఆర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications