శిశువు చెవులు కోసిన డాక్టర్:విశాఖలో పాప మృతి

విశాఖపట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే లక్ష్మీకి సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావటంతో ఆమె భర్త మురళీ కృష్ణ మరియు బంధువులు కలిసి రైల్వే న్యూకాలనీలోని కృష్ణ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంతో బిడ్డ చెవులు కోశాడు. దాంతో ఆ శిశువు మరణించాడు. అయితే డాక్టర్లు ఓ చాపలో శిశువును చుట్టి అతను పుట్టగానే చనిపోయాడని, తల్లి పరిస్థితి కూడా ఆందోళనగా ఉందని చెప్పి వారిని పంపించారు.
తెల్లవారు జామున శిశువును పూడ్చి పెట్టడానికి వెళ్లిన బంధువులు శిశువు చెవులు కోసి ఉండటాన్ని గమనించి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని, ఆసుపత్రి ముందు శిశువు మృతదేహంతో ఆందోళన సాగిస్తున్నారు. శిశువు ప్రాణాలను బలి తీసుకున్న శ్రీనివాసమూర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఆందోళన చేపట్టినప్పటికీ డాక్టర్ ఇంతవరకు బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పకపోవటంపై కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు డాక్టర్ ను విచారించేందుకు ఆసుపత్రిలోకి వెళ్లారు. ఎవరినీ ఆసుపత్రిలోకి అనుమతించటం లేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications