హైదరాబాద్: హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడగా అది గమనించిన పోలీసులు వారిని రక్షించారు. సికింద్రాబాద్ లోని కార్ఖానకు చెందిన రమ్య, రమాకాంత్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమకు ఒప్పుకోరని భావించి వారు చనిపోవాలనుకున్నారు. మంగళవారం ఉదయం టాంక్ బండ్ కు వచ్చి హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన పోలీసులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.