మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఢిల్లీకి: ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల ఆగడాలు శృతిమించుతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకు రుణాలు అందరికీ అందుబాటులో లేక పోవటం వల్లనే మైక్రో పైనాన్స్ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించినట్లు చెప్పారు. మైక్రో ఫైనాన్స్ లను నిషేధిస్తే సామాన్యులు ఇబ్బందులు పడవలసి వస్తుందేమోనని ఆయన అబిప్రాయం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ దారుణాలపై ప్రధానికి వివరించానని చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధానితో చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానిలతో సమావేశమయి పోలవరం జాతీయ హోదా, మైక్రో ఫైనాన్స్ ఆగడాలు, మంత్రివర్గ విస్తరణ, ఉద్యోగులు పీఆర్సీ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను చర్చించారు.












Click it and Unblock the Notifications