అక్రమాలు చేస్తున్నవారే జగన్ ను విమర్శించాలా: టీడీపీ

Varla Ramaiah
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మనీ సంపాదించుకోవాలని అనుకుంటున్న వారందరికీ ఆదర్శమని తెలుగు దేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఆయనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. భారీ ఆక్రమాలకు పాల్పడ్డ వైఎస్ జగన్ అక్రమాలు చేస్తున్నారంటూ ఇతరులపై విమర్శలు చేయటం హాస్యాస్పదం అన్నారు. అయితే అక్రమాలు చేస్తున్న వారే జగన్ ను విమర్శించాలా అని ఆయన ప్రశ్నించారు.

వైఎస్ కుటుంబం అటు దేశ, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఇప్పుడు జగన్ ఆయన్ను మించిపోయారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై అంబటి రాంబాబు విమర్శలు చేయడం హాస్యాస్పదం అని, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదన్నారు. ఆయనవన్నీ థర్డ్ రేటు మాటలు అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+