వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్రో ఫైనాన్స్ పాపం రామోజీదేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: మైక్రో ఫైనాన్స పాపం ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుదేనని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక దుమ్మెత్తి పోసింది. నారా చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పలు తెప్పలుగా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు అనుమతులు ఇస్తూ పోయారని, దాన్ని ఉపయోగించుకుని రామోజీ రావు కోట్లు సంపాదించారని సాక్షి దినపత్రిక ఆరోపించింది. రామోజీ రావుకు మైక్రో ఫైనాన్స్ సంస్థలతో ఉన్న లింకులు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు శుక్రవారం సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. ఆ వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనాడు పత్రికతో సహా రామోజీ గ్రూపులో 41 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థల్లో జేఎం ఫైనాన్షియల్ అధినేత నిమేష్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. మరోవంక ఇదే కంపానీకి చెందిన జేఎం ఫైనాన్షియల్‌కు రాష్ట్రానికి చెంది న స్పందన మైక్రోఫైనాన్స్‌లో దాదాపు 20 శాతం వాటా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే 'స్పం దన"లో కంపానీ వాటా కొన్నది 2007 జూలైలో. రూ. 40 కోట్లు వెచ్చించి స్పందనలో 20 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఆ తరవాత... అంటే 2008 జనవరిలో ఈక్వేటర్ ట్రేడింగ్ ద్వారా రామోజీ గ్రూపులో కంపానీ 26 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 100 విలువైన ఒకో షేరుకు రూ. 5,28,830 చొప్పున మెుత్తం రూ. 1,350 కోట్లను వెచ్చించారు. అంటే... నిమేష్ కంపానీకి రాష్ట్రంలోని మైక్రోఫైనాన్స్ సంస్థలతో ఉన్న లింకుల గురించి అప్పటికే రామోజీకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే కంపానీ వాటా తీసుకుని అప్పటికే 6 నెలలు గడిచిపోయింది కాబట్టి. అయినా సరే కంపానీ పెట్టుబడిని రామోజీ ఆహ్వానించారు. అంటే ఇపుడు రామోజీ కంపెనీలో భాగస్వామిగా ఉన్నవారికి రాష్ట్రంలోని 'సూక్ష్మ"సంస్థల్లో కూడా వాటాలున్నాయన్న మాట. సూక్ష్మ రుణాల పేరిట జనాన్ని జలగల్లా పీల్చేస్తున్న వారిలో రామోజీ భాగస్వావుులూ ఉన్నారన్న వూట.

అసలు సూక్ష్మ రుణ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి నిమేష్ కంపానీ లాంటి వారు కూడా ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారు? ఇది తెలియాలంటే ఈ సంస్థల్లో వచ్చే లాభాల గురించి కొంతైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సంస్థలు నిధుల్ని సమీకరించుకోవటానికి ఒకోసారి బ్యాంకుల నుంచి 14-18 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటూ ఉంటాయి. కానీ జనాలకిచ్చే రుణాలపై ఇవి ఏకంగా 28 నుంచి 40 శాతం వడ్డీని వసూలు చేస్తుంటాయి. అవతలి మనిషి తాలూకు అప్పుతీర్చే సామర్థ్యం... అతని అవసరం ఆధారంగా ఈ సంస్థలు వడ్డీని నిర్ణయిస్తూ ఉంటాయి. అందుకే ఈ సంస్థల లాభాలకు అంతుండటం లేదు. ఉదాహరణకు కంపానీనే తీసుకుంటే ఆయన రాష్ట్రంలోని మైక్రోఫైనాన్స్ కంపెనీలో 2007లో పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 40 కోట్లు. దానికి గాను ఆయనకు దక్కిన వాటా 20 శాతం. అయితే సదరు మైక్రోఫైనాన్స్ కంపెనీలో ఈ ఏడాది మొదట్లో సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ పెట్టుబడి పెడతానని ప్రతిపాదన చేసింది. కంపెనీ విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేసి... 10 శాతం వాటా కోసం రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతానని ప్రతిపాదించినట్లు స్పందన సంస్థ అధినేత పద్మజారెడ్డి స్వయుంగా చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే కంపానీ వాటా విలువ ప్రస్తుతం రూ. 600 కోట్లు. అంటే మూడేళ్లు తిరక్కుండా రూ. 40 కోట్లు 15 రెట్లు పెరిగి రూ. 600 కోట్లుగా వూరిపోయూయున్న మాట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X