జగన్ సన్నిహితుడు గాలి జనార్ధన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలేవి: వెంకయ్య
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆక్రమ మైనింగ్ లపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవటం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ పై నిషేధం విధించినట్లు కూడా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ పై నిషేధం ఎందుకు విధించటం లేదని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.
ఈవీఎం లలో లోపాలు ఉన్నాయంటే స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్ లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ రాజ్ భవన్ ను కాంగ్రెస్ భవన్ గా మార్చారని, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఆయన పచ్చి కాంగ్రెస్ వాది అని నిరూపించుకున్నాడని ఆరోపించారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ తో కలిపి మైనింగ్ మాఫియా చేతులు కలిపిందని ఆరోపించారు.