మంత్రాన నెపంతో వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్తులు
Districts
oi-Srinivas G
By Srinivas
|
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు మండలంలోని చెన్నారంలో మంత్రాల నెపంతో ఓ వృద్దడిని కొట్టి చంపారు. గ్రామస్తులు నిరంజన్ అనే వృద్ధుడు మంత్రాలు చేసి ఊళ్లో వారిని చంపుతున్నాడని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం గ్రామం మధ్యకి పిలిపించి ఓ చెట్టుకు కట్టేసి బాగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ వృద్దుడు మరణించాడు.
రెండునెలల క్రితం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మరణించారు. అంతకుముందు కూడా కొందరు చనిపోయారని, వారందరని నిరంజన్ మంత్రాలు చేసి చంపాడని ఆరోపిస్తున్నారు. అయితే నిరంజన్ను కొట్టి చంపిన ఆ గ్రామస్తులే తమ ఆరోగ్యం బాగా లేకుంటే బాగు చేయమని ఆయన దగ్గరకు వెళ్లేవారు.