వైయస్ జగన్ క్యాంపుపైనే సిఎం రోశయ్యతో డి. శ్రీనివాస్ చర్చ

Srinivas
హైదరాబాద్: తమ ఆదేశాలను ధక్కిరిస్తూ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ క్యాంపుపైనే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కె. రోశయ్యతో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. దాదాపు అరగంటసేపు వారిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలపై మాట్లాడుకున్నారని సమాచారం. రోశయ్య ఢిల్లీలో పార్టీ పెద్దలందరినీ కలసి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధి రోశయ్యకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలంగానే ఉన్నా పట్టు ఏమాత్రం జారకుండా చూసుకోవాలనేది సోనియా అభిప్రాయంగా భావిస్తున్నారు.

కడప ఎంపీ జగన్మోహనరెడ్డి ధిక్కార ధోరణని కూడా దృష్టిలో ఉంచుకునే సోనియా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే భావన పార్టీ శ్రేణుల్లోకి పంపి మరింత పటిష్ఠపరచాలనేది ఆమె ఉద్దేశంగా నేతలు భావిస్తున్నారు. సోనియా ఆదేశాన్ని సీఎం ఇప్పటికే మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులకు వివరించారు. ఆ మేరకు పార్టీని ముందుకు నడపడంలో సహకరించాలని వారిని కోరారు. ఈ నేపథ్యంలోనే రోశయ్య డీఎస్‌తో భేటీ అయ్యారు. పార్టీలో తలెత్తుతున్న క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరాదనే అంశం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు స్థానిక నేతలపై చర్యల విషయంలో పీసీసీ కఠినంగానే వ్యవహరిస్తోంది. కొంతమందిని సస్పెండ్‌ చేయగా మరికొందరికి షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలో నడుస్తున్న ధిక్కార కార్యకలాపాలపై డీఎస్‌ ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు. పెద్ద నేతల విషయం తమకు వదిలిపెట్టి పీసీసీ, డీసీసీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యల విషయంలో మాత్రం వెనుకాడవద్దని అధిష్ఠానం డీఎస్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి, డీఎస్‌ చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+