వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సమీక్షించలేదు: ఆనం రామనారాయణ రెడ్డి

Anam Ramnarayana Reddy
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రపై అధికారుల సమావేశంలో విశ్లేషించలేదని జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఓదార్పు గురించి తానసలు మాట్లాడనని తేల్చి చెప్పారు. మెక్రో సంస్థలపై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై శనివారమిక్కడ అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.

అధికారులతో జరిపిన భేటీలో ఓదార్పు యాత్రకు సంబంధించిన ప్రస్తావనే రాలేదన్నారు. అసలు ఆ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తొలి నుంచి అనుసరిస్తున్న వైఖరినే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. తన కుటుంబంపై గోనె ప్రకాశ్‌రావు చేసిన విమర్శలను ప్రస్తావించగా ' గోనె ప్రకాశ్‌రావు వ్యాఖ్యలపై కూడా స్పందించాలా? ఆయన కేడర్ ఏమిట'ని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+