టాటా ఇనిస్టిట్యూట్ పై అపోహలున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
హైదరాబాద్: టాటా ఇనిస్టిట్యూట్ కు హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి కేటాయింపుపై ఆపోహలున్నాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అది ప్రైవేట్ సంస్థ కాదని, అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ అని, ఎంతో కృషి ఫలితంగా అది హైదరాబాదుకు వచ్చిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రభుత్వం తరఫున రేపు మంగళవారం రిసెప్షన్ ఉండదని, సెండాఫ్ మాత్రమే ప్రభుత్వం తరఫున ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రేపు మంగళవారం ఉదయం నగరానికి రానున్నారు. 11.30గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతంర 12గంటలకు 'అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ది డెవలపింగ్‌ వరల్డ్‌' సమావేశాన్ని ప్రారంభిస్తారు. 2.30గంటలకు టాటా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌రు మన్మోహన్‌ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.40కి తిరిగి ఢిల్లీ తిరిగి ప్రయాణమవుతారు.

ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం సచివాలయంలో మార్కెటింగ్, సహకార సంఘాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2 నెలలుగా రైతులతో సమావేశమయ్యి వారి సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ధాన్యంను నిలువ ఉంచడానికి ఒక సంవత్సరం పాటు ప్రయివేటు గోదాములను అద్దెకు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

అలాగే 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచడానికి కావాల్సిన గిడ్డంగులను 9నెలల్లో పూర్తి చేయాలని అధికారాలను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే రబీ నాటికి 3వేల కోట్ల రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు చెప్పారు. రైల్వే సహకారం, భారత ఆహార సంస్థల సహకారాన్ని కూడా కోరనున్నట్లు చెప్పారు. పాత ధాన్యాన్ని విదేశాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చీపురుపల్లి, కుప్పం రెప్కో ఎన్నికలను నెలలోపు నిర్వహిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+