మైనర్ బాలికతో పెళ్లి వల్లే ఆర్టీసి ఉద్యోగి బాలగంగాధర్ హత్య?

మైనర్ బాలికను స్వధార హోమ్ కు చేర్చారు. ఆ తర్వాత ఆమెను హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఆమె బాలగంగాధర్ లో రాజమండ్రిలో ఉంటున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజమండ్రి డిపోలో బాలగంగాధర్ పనిచేస్తున్నాడు. అయితే అతను రాజమండ్రిలో ఎక్కడ ఉంటున్నాడనే తెలియడం లేదు. ఆ ఇల్లు ఆచూకీ దొరికితే తప్ప మైనర్ బాలిక అతనితో ఉంటుందా లేదా అనే తెలుసుకోవడం సాధ్యం కాదు. కొవ్వూరులో మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా లేరు.
మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం తప్ప బాలగంగాధర్ పై ఇతర చెడు వ్యవహారాలు ఉన్నట్లు లేవు. అతను ఆర్టీసి యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. నేషనల్ మజ్దూర్ యూనియన్ లో పనిచేసేవాడు. తాను పదవీవిరమణ చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇస్తానని చెప్పి బాలగంగాధర్ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. భార్య మరణించడంతో అతను ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే స్వామి తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications