బెజవాడలో వ్యాపారి కుమారుడి కిడ్నాప్: రూ.2 కోట్లు డిమాండ్

Vijayawada
విజయవాడ: విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాలాల్ జైన్ అనే ఎలక్ట్రికల్ వ్యాపారి కుమారుడు కమలేష్ జైన్ కిడ్నాప్ కు గురయ్యాడు. కిడ్నాపర్లు హీరాలాల్ ను 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంతగా ఇచ్చుకోలేనని ఆయన చెప్పటంతో కిడ్నాపర్లు 80 లక్షల రూపాయలకు దిగినట్లు సమాచారం.

ఈ నెల 14 వ తేది గురువారం రోజున కమలేష్ ను కిడ్నాప్ చేశారు. ఆ రోజు రాత్రి కిడ్నాపర్లు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫోన్ విజయవాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చింది. కిడ్నాపర్లు 15, 16వ తేదీల్లో కూడా ఫోన్ చేసి డబ్బులు అడిగారు. అయితే ఆ తరువాత 17 వ తారీఖునుండి కిడ్నాపర్ల నుండి ఎలాంటి ఫోన్ లేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మంగళవారం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమకు తమ కొడుకు ముఖ్యమనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు మీడియాకు, పోలీసులకు చెప్పలేదని, కాని కిడ్నాపర్ల నుండి 16వ తేదీ తరువాత ఇప్పటి వరకు ఎలాంటి ఫోన్ రాకపోవటంతో పోలీసులను అశ్రయించామన్నారు.

కాగా కిడ్నాప్ అయిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం, విజయవాడ పరిసరాల్లో నుండే ఫోన్ రావటం, గత కొంతకాలంగా ప్రేమ కోసం, డబ్బుల కోసం కిడ్నాప్ గురైనట్లు నాటకాలు ఆడటం, కిడ్నాప్ కు గురైన కమలేష్ జైన్ కు పెళ్లి కాకపోవటంతో ప్రేమ వ్యవహారం కూడా ఉండిఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కమలేష్ జైన్ స్నేహితులను కొందరిని ఇంటరాగేట్ చేశారు. పోలీసులు తాము సేకరించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+