ప్రధాని పర్యటన ఉద్రిక్తం: చంద్రబాబు సహా పలువురి అరెస్టు

కాగా రైతు సమస్యలు మరియు మైక్రో పైనాన్స్(సూక్ష్మ రుణసంస్థల) వేధింపులపై ప్రధానికి విన్నినించుకునేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్, రసూల్ పురా చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రధాన ప్రతిపక్షం ,తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ తదితర అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ధర్నాకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధానమంత్రి గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. రైతుల సమస్యలపై, రాష్ట్రంలో పెరిగిపోతున్న సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై ప్రధానిని కలవడానికి అనుమతిని ఇవ్వక పోవటంపై వారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై విన్నివించుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనని లేకుంటే ప్రధానమంత్రి రాష్ట్రంలో అడుగు పెట్టవద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగు దేశం, సిపిఎం, సిపిఐ తదితర అన్ని పార్టీల ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు యూనివర్శిటీ భూములను టాటా వారికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మన్మోహన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్శిటీ ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications