సీమాంధ్రలో లాయర్ల దీక్ష భగ్నానికి పోలీసుల యత్నాలు

ప్రభుత్వం ప్రత్యేక బెంచ్ పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను విరమించే ప్రసక్తి లేదన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ కక్రూ బెంచ్ ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నట్టు స్పష్టంగా చెప్పారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కాగా నిరాహార దీక్ష చేస్తున్న లాయర్లకు మహిళా న్యాయవాదులు మద్దతు పలికారు. పోలీసులు అరెస్టు చేయడానికి రాకుండా అడ్డుకున్నారు.
కాగా రాయలసీమలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీమ ప్రాంత ఎమ్మెల్యేలు గురువారం నుండి ఈనెల 30వ తేది వరకు దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. పలు రాష్టాల్లో ప్రత్యేక బెంచ్ లు ఉన్నాయి. కాని మన రాష్ట్రంలోనే లేదు. హైకోర్టులో కేసు వేస్తే హైదరాబాద్ వరకు రావటం సీమాంధ్రులకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. డబ్బులు ఎక్కువ కావటంతో పాటు, సమయాభావం కూడా తీసుకుంటుందని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications