వైయస్ జగన్ తో కలిసి రాకుంటే మట్టిలో కలుస్తారు: కొండా సురేఖ

Konda Surekha
నెల్లూరు: వైయస్ జగన్ వర్గం వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి బ్రదర్స్ పై వారి సొంత జిల్లా నెల్లూరులోనే ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనే తమ సర్వస్వమని మాట్లాడిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు గతి తప్పుతున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ప్రజలు స్వచ్ఛందంగా నెలకొల్పుకుంటుంటే ఆనం బ్రదర్సే అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓటు వెయ్యాలంటే ఆనం బ్రదర్సు ప్రజల కోరిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎక్కడైనా నాయకుల నిర్ణయంతో పనిలేదని ప్రజల నిర్ణయమే తుది నిర్ణయమని ఆమె అన్నారు. ప్రాణాలైనా అర్పించి తమ నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుతామంటున్న ప్రజలముందు ఆనం సోదరులు నిలవలేరన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి చూడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఓదార్పుకు అన్ని జిల్లాల్లోకన్నా నెల్లూరులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న విషయం ఆనం సోదరులు తెలుసుకోవాలని సూచించారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొనకపోయినా ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొననివారే మట్టిలో కలిసి పోతారని ఆమె అన్నారు. జగన్ కు విశేష ఆదరణ లభిస్తోందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+