రక్త చరిత్ర భాష్యం: ఎన్టీఆర్ విలన్, వైయస్సార్ హీరో?

NT Rama Rao-YS Rajasekhar Reddy
హైదరాబాద్: రక్త చరిత్ర సినిమాలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రామ్ గోపాల్ వర్మ ప్రతినాయకుడిగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వర్మపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్ కు ప్రజల్లో ఎనలేని అభిమానం ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తిరుగులేదు. పేదల పాలిటి పెన్నిధిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి పథకాలు చేపట్టి పేద ప్రజల మన్ననలు పొందారు. ఆయనను అపర కృష్ణుడిగా పూజించే వారున్నారు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు అనన్య సామాన్యమైవనే పేరుంది. ఈ స్థితిలో రామ్ గోపాల్ వర్మ ఓ మిత్ ను ఛేదించినట్లు రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నెగెటివ్ గా చూపించారు. అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని చెప్పలేం. కానీ కాంగ్రెసుకు ఏదో మేరకు లాభం చేకూరుస్తుందని మాత్రం నమ్ముతున్నారు. అది కూడా, వైయస్ రాజశేఖర రెడ్డిని ఆయన కుమారుడితో పాటు కాంగ్రెసులోని చాలా మంది నాయకులు మహా నేతగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రక్తచరిత్ర సినిమా వచ్చింది.

నిజానికి, చాలా కాలంగా ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలకు వైయస్సార్ ను అడ్డు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ కు ఉన్న ఆదరణను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. వైయస్సార్ వంటి నేత లేరంటూ ఆయన కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఊరూరూ తిరిగి చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆదరణను చూరగొన్న నాయకుడు వైయస్సార్ మాత్రమేనని చెప్పాలి. అయితే, వైయస్సార్ కు ఫాక్షనిజం మచ్చ ఉంది. రక్తచరిత్రలో ఓ ప్రధాన పాత్ర అయిన మద్దెలచెర్వు సూరికి వైయస్సార్ ఆండదండలు పుష్కలంగా ఉండేవని అంటారు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కూడా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. వైయస్సార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులను ఫాక్షనిజానికి పేరు మోసిన రాజశేఖర రెడ్డి చంపిస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు కూడా. రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర -2లో వైయస్సార్ పాత్ర ఉందా అనేది ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. వైయస్సార్ పాత్ర ఉంటే అది ఉదాత్తంగా ఉంటుందా, ఫాక్షనిజం మచ్చ ఉన్న వ్యక్తిత్వంగా ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశమే. వైయస్సార్ ను మహానేతగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీఆర్ ను రక్త చరిత్రలో విలన్ గా చూపించారా అనేది సందేహించాల్సిన విషయం. ఆదరణ విషయంలో, ఇమేజ్ విషయంలో దివంగత నేత వైయస్సార్ కు ఎన్టీ రామారావే పోటీ. ఇది కమ్మ, రెడ్ల ఆధిపత్య వ్యవహారాలకు సంబంధించిందా అనేది కూడా చర్చనీయాంశమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+