నైరోబీ: కెన్యా రాజధాని నైరోబిలో ఓ ఫుట్‌బాల్ స్టేడియంలోకి భారీ సంఖ్యంలో ఫుట్ బాల్ అభిమానులు రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నైరోబీలో ఉన్న న్యాయో జాతీయ స్టేడియంలో రెండు ముఖ్యమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు భారీ సంఖ్యంలో ఫుట్‌బాల్ ప్రేమికులు వచ్చారు. వారందరి మధ్య తోపులాట జరిగింది. లోనికి వెళ్లేందుగు ఒకరిమీద ఒకరు విరగబడటంతో స్టేడియం ప్రవేశ ద్వారంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు కెన్యా పోలీసులు తెలిపారు.