ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నాయి

మైక్రో ఫైనాన్సుల(సూక్ష్మరుణ సంస్థల) వేధింపులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.ప్రజలకు రుణాలు తీసుకోవడానికి సరియైన సదుపాయాలు ప్రభుత్వం కల్పించనందునే ప్రజలు సూక్ష్మరుణసంస్థలలో అధిక వడ్డీకీ డబ్బులు వేధింపులకు గురవుతున్నారన్నారు. సూక్ష్మ రుణ సంస్థల వేధింపులు అరికట్టాలంటే ప్రతి గ్రామంలో బ్యాంకు, ప్రతి వ్యక్తికి బ్యాంకు అకౌంటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు.
విజయవాడ -గుంటూరుల మధ్య హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్న సీమాంధ్ర న్యాయవాదుల న్యాయపరమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. వెంటనే ప్రభుత్వం గుంటూరులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications