తెలంగాణకు తాను వ్యతిరేకమని వైఎస్సే చెప్పారు : కేశవరావు

మహబూబ్ నగర్లో నేతల ప్రసంగాలను అడ్డుకోవటం అనాగరికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అక్కడి మాదిరే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జరిగే తెలంగాణ ఆత్మగౌరవ సభను అడ్డుకుందామని కొందరు చూస్తున్నారు. ఎవరో ఇద్దరి కోసం ప్రాంతీయ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారన్నారు. అలా అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగత ప్రచారం కోసం త్యాగధనులకు కించపర్చడం శోచనీయమన్నారు. అలా అయితే ప్రజలు వారికి బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎమ్మార్ పై రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడేటప్పుడు కొందరు గొడవ చేయటం కావాలనే చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. అదే నిజమైతే చాలా ప్రమాదకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications