కోస్తాంధ్రలో హైకోర్టు బెంచ్ కోసం ఉధృతమవుతున్న ఉద్యమం

High Court
విజయవాడ: విజయవాడ - గుంటూరు మధ్యలో హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్న సీమాంధ్ర లాయర్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి హామీ ఇచ్చే వరకు తాము ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. ఉద్యమం మా చేతుల్లోనుండి ప్రజల చేతుల్లోకి వెళితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని లాయర్లు అంటున్నారు.

హైకోర్టు బెంచ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మంత్రి పార్థసారథిని లాయర్లు ముట్టడించారు. తమకు వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఆయితే అంతకుముందు లాయర్లు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని లాయక్లు ముట్టడించారు. అధికారుల జరుపుతున్న సమావేశ మందిరంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కాగా ఇప్పటికే కోస్తాంధ్రలో బెంచ్ కోసం జరుగుతున్న ఉద్యమం మూడు రోజుల క్రితం ఉత్తరాంధ్రకు పాకిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లా లాయర్లు విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని మూడు రోజులుగా ధర్నా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాము గాంధీ చూపిన అహింసా మార్గంలో బెంచ్ కోసం పోరాడుతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి బెంచ్ ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+