ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఓ కాంగ్రెసు నాయకుడు హత్యకు గురయ్యాడు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. చీమకుర్తి కాంగ్రెసు నాయకుడు గుర్రం అంజయ్యను రాజేశ్ అనే వ్యక్తి హత్య చేశాడు. అంజయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు. అంజయ్య హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. హత్య చేసిన రాజేశ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు రాజేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.