వచ్చే నెల 2 నుంచి రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వచ్చేనెల 2,3,4 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో మొత్తం 8 నియోజకవర్గాలలో ఆయన పర్యటిస్తారు. సూక్ష్మరుణ బాధితులను బాబు పరామర్శించి ధైర్యం చెబుతారు. మొదటిరోజు ఆయన ఇబ్రహీంపట్నం, ఎల్‌బీ నగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో రెండవరోజు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మూడవరోజు మేడ్చల్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. డ్వాక్రా మహిళలతోకూడా బాబు సమావేశాలు నిర్వహిస్తారు.

చంద్రబాబు శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్చించారు. వాటికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆందోళనపై కూడా ఆయన చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు రంగారెడ్డి జిల్లా పర్యటనను ఖరారు చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలవారికి ఆర్థిక సాయం అందించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+