హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాతో వాదనకు దిగిన టి. సుబ్బిరామిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

T Subbirami Reddy
హైదరాబాద్: తన మనసు గాయపరిచినా పట్టించుకోనని కాంగ్రెసు నాయకుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. లలితా కళాతోరణం పేరు మార్పుపై చెలరేగిన వివాదానికి దారి తీసిన పరిస్థితిపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తనను చాలా మంది అపార్థం చేసుకున్నారని ఆయన అన్నారు. తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్ గాంధీ లలితా కళాతోరణంగా పేరు మారిస్తే తెలుగు గౌరవం దెబ్బ తింటుందనే విమర్శపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మీరు తెలుగుదేశం పార్టీవారా అని ఆయన అడిగారు. మీకు రాజకీయాలు తెలియదని అన్నారు. తెలుగుదేశం పార్టీవారు పేరు మార్పునకు అభ్యంతరం చెప్పారని ఆయన అన్నారు. తాను ప్రస్తుత లలిత కళాతోరణం పేరు మార్చాలని అడగలేదని ఆయన చెప్పారు. ఓ ఇండిపెండెంట్ ఆడిటోరియం నిర్మించి దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని తాను ప్రతిపాదించానని ఆయన అన్నారు. అభ్యంతరం చెప్పడంతో తాను ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాసినట్లు తెలిపారు. దాన్ని రాజకీయం చేశారని ఆయన విమర్శించారు.

విరాళాలు ఇచ్చిన వ్యక్తి పేరు గానీ ఆ వ్యక్తి సూచించిన పేరు గానీ పెట్టడం సంప్రదాయమని, అందుకే తాను రాజీవ్ గాంధీ పేరు సూచించానని ఆయన చెప్పారు. నటరాజుకు కళలతో సంబంధం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కళాసేవ చేయాలనేది తన అభిమతమని ఆయన చెప్పారు. తాను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి లలిత కళాతోరణం పేరు మార్చాలని అడగలేదని, విడిగా కళాకారులకు అనువుగా ఉండే విధంగా ఆడిటోరియం నిర్మించాలని సూచించానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేశాయని, అది తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. టీవీ9 యాంకర్ రజనీకాంత్ పై ఆవేశంగా మాట్లాడాల్సింది కాదని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశ్నించకూడదని ఆయన అన్నారు. టిఎస్ఆర్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మీకు తెలియదు, నేను చెప్పేది వినండి అంటూ తన వాదనను ఆయన వినిపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X