హైదరాబాద్: నవంబరు ఒకటో తేదిన జరుగే రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో రాష్ట్రంలోని మంత్రులందరూ పాల్గొంటారని దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఫోన్లో మాట్లాడారు. మంత్రులు కోమటిరెడ్డి, దానం నాగేందర్ ఇప్పటికే తాము అవతరణ వేడుకల్లో పాల్గొంటామని చెప్పారని, ఆలాగే అందరు మంత్రులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య మంత్రులు ఇష్టం ఉంటే పాల్గొనవచ్చు. లేదంటే లేదు అనటంపట్ల ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి ఆలా మాట్లాడలేదని కొందరు ఆయన మాటలను వక్రీకరించారని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పింది కాంగ్రెస్ పార్టీ నేతలకు, నాయకులకు అయితే దానిని అందరూ మంత్రులను అంటూ వక్రీకరించారన్నారు. పార్టీలకు చెందిన వారిది వ్యక్తిగత ఇష్టం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి అలా చెప్పారు. అయితే మంత్రులకు ఇది వర్తించదన్నారు.