సిడబ్ల్యుసిలో స్థానానికి పోటీ పడుతున్న ఎపి నాయకులు

సిడబ్ల్యుసిలో స్థానం కోసం తెలంగాణ నుంచి జి. వెంకటస్వామి, కె. కేశవరావు, వి హనుమంతరావు, నంది ఎల్లయ్య ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్జన్ రెడ్డి, జెడి శీలం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెంకటస్వామి ఇప్పటి వరకు సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్నారు. వయస్సు పైబడడంతో వెంకటస్వామిని సిడబ్ల్యుసి నుంచి తప్పిస్తారని భావిస్తున్నారు. కాగా, సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి కూడా అదే సమస్య ఎదురవుతోంది. అకస్మాత్తుగా కేంద్ర మంత్రి పురంధేశ్వరిని సోనియా తెర మీదికి తేవచ్చునని అనుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సిడబ్ల్యుసిలో స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే, పిసిసి అధ్యక్షుడి మార్పు ఇప్పుడిప్పుడే లేకపోవడంతో ఆయనకు స్థానం లభించకపోవచ్చునని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదు. ఆయన వర్గానికి చెందిన నాయుకలెవరికీ ఆహ్వానాలు అందలేదు.












Click it and Unblock the Notifications