డిసెంబర్ ఫీవరేమిటో పార్లమెంటులో అడుగుతాం: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబర్ నెల సమీపిస్తోందని, డిసెంబర్ ఫీవర్ అంటున్నారని, ఆ డిసెంబర్ ఫీవరేమిటో పార్లమెంటులో అడుగుతామని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, అందుకోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. కేంద్రం శ్రీకృష్ణ కమిటీకి డిసెంబర్ గడువు ఇచ్చిందని, ఆ డిసెంబర్ రహస్యం త్వరలో తెలుస్తుందన్నారు.

సూక్ష్మరుణ సంస్థల వేధింపులు రాష్ట్రంలో ఎక్కువవుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులకు గిట్టబాటు ధర లేక అల్లాడుతున్నారని ఈ రెండు విషయాలను సైతం పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. సిబిఐని, గవర్నర్ ని కాంగ్రెసు ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించనీయకుండా కేవలం తమ రాజకీయ కక్ష్యలకోసమే ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. సిబిఐ లేకపోతే కాంగ్రెసు ప్రభుత్వానికి మనుగడే లేదని ఎద్దేవా చేశారు. ఏఐసిసి సమావేశంలో ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టకుండా అనవసరంగా సమయాన్ని వృధా చేశారన్నారు.

దేశంలో ఎన్నో సమస్యలున్నాయని ఆయన చెప్పారు. అవినీతి, అక్రమాలపైన ఏఐసిసిలో మాటవరుసకైనా చర్చకు రాకపోవటం గర్హనీయమన్నారు. పరనింద, పలాయనం, పక్కదారి ఇదే పద్ధతిలో కాంగ్రెసు వెళుతోందని విమర్శించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ను కాంగ్రెసు లక్ష్యంగా చేసుకుంటుందని అన్నారు. దేశభక్తిగల సంస్థలకు, దేశానికి విద్రోహం తలపెట్టే సంస్థలకు మధ్య తేడాలు కాంగ్రెసు పార్టీకి తెలవకపోవడం శోచనీయమన్నారు. దేశభక్తి పూరిత ఆర్ఎస్ఎస్ పైని నిత్యం ధ్వజమెత్తుతున్న కాంగ్రెసు అదే సమయంలో దేశానికి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ఐఎస్ఐపైన మాట్లాడకపోవటం వారి దేశభక్తిని ప్రశ్నించవలసిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆర్ఎస్ ఎస్ పైన దేశభక్తికి వ్యతిరేక ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవట్టని ఆయన సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+