కోస్తాంధ్రకు తుఫాను గండం: అప్రమత్తమైన అధికారులు

Recommended Video

    Hospitality & Tourism Industry has created 4 Cr jobs in India

    Cyclone
    విశాఖపట్నం: రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్రకు తుఫాను ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుఫానుకు జల్ అనే పేరు పెట్టారు. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన జల్‌ తుపాను విశాఖకు 1000 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి ఆగ్నేయంగా 750 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైవుంది. నెల్లూరు -పుదుచ్చేరి మధ్య ఆదివారం సాయంత్రంలోగా ఈ తుపాను తీరం దాటవచ్చని వాతావరణకేంద్రం తెలిపింది.

    రాష్ట్రంలోని అన్నీ ఓడ రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రంలో భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున వేటకి వెళ్లవద్దని మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారు. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులు ప్రారంభమవుతాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాలర్లు తమ ఇళ్లు వదిలి రావడానికి మొరాయిస్తున్నారు. వారిని బలవతంగా తరలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+