జగన్ అలా ఎందుకన్నాడో, ఆయనే సమాధానం చెప్పాలి: పొంగులేటి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వైయస్ కుటుంబానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కడప పార్లమెంటు సభ్యుడు జగన్ సహనం నశిస్తే ఉప్పెన వస్తుందని ఎందుకు అంటున్నాడో తనకు అర్థం కావటం లేదన్నాడు. అలా అనడానికి గల కారణాలు అయనే చెప్పాలని కోరారు. జగన్ అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.