ఎసిపిపై చంద్రబాబు ఆగ్రహం: టిడిపి ఎమ్మెల్యేలకు పరామర్శ

Chandrababu Naidu
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం పోలీసు స్టేషన్ వద్ద నిరసన చేస్తున్న తమ పార్టీ శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన గన్నవరం చేరుకున్నారు. తమ పార్టీ శాసనసభ్యులను నిర్బంధించడంపై ఆయన ఎసిపి నాగరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ఎందుకు నిర్బంధించారని ఆయన అడిగారు. సమస్యలను విన్నవించడానికి వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కాగా, కృష్ణా జిల్లా గన్నవరం పోలీసు స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. వారి నిరసన కార్యక్రమం సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది. పోలీసు స్టేషన్ వద్దే వారు వంటావార్పూ చేసుకుంటున్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల గన్నవరం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి కె. రోశయ్యను కులులుకోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తెలుగుదేశం నాయకులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారు పోలీసు స్టేషనులోనే తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకోవాలని వారన్నారు. కృష్ణా డెల్టా ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వర రావుతో పాటు ఆరుగురు తెలుగుదేశం శాసనసభ్యులు పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+