హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్ర అధ్యయనానికి భాను ప్రతాప్ మెహతా ప్యానెల్

Pratap Bhanu Mehta
న్యూఢిల్లీ: హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ కు ప్రముఖ విద్యావేత్త ప్రతాప్ భాను మెహతా నేతృత్వం వహిస్తారు. ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ నుంచి వేరు చేస్తే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై ఈ ప్యానెల్ అధ్యయనం చేస్తుంది. కొన్ని వారాల క్రితమే ఈ ప్యానెల్ ను ఏర్పాటు చేసినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచారు. దాన్ని ఆదివారం బయట పెట్టారు.

మెహతా ప్రస్తుతం న్యూఢిల్లీలోని పాలసీ ప్యానెల్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. హైదరాబాద్ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఆయనను కన్సల్టెంట్ గా నియమించుకుంది. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ ప్యానెల్ ఇప్పటికే పని ప్రారంభించింది. ఈ ప్యానెల్ హైదరాబాదు స్థానికులను, అంటే ముల్కీలను సంప్రదిస్తోంది. హైదరాబాదును ప్రత్యేక అస్తిత్వంగా గుర్తిస్తూ ఈ ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని సేకరిస్తోంది. హైదరాబాదు నుంచి 60 వేల కోట్ల రెవెన్యూ వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+