పాలమూరు జిల్లాలో ప్రేమోన్మాదిని ఊరేగించి చెప్పులతో కొట్టిన గ్రామస్థులు

Mahaboobnagar District
మహబూబ్ నగర్: ప్రేమ పేరుతో గత రెండు నెలలుగా పదో తరగతి చదువుతున్న బాలికను వేధిస్తున్న సత్తార్ అనే యువకుడికి పోలీసులు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు. ఆ యువకుడిని గ్రామంలో ఊరేగించి అతన్ని చెప్పులతో కొట్టారు. అతనికి గుండు చేసి ఊరేగించే ప్రయత్నం కూడా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని సత్తార్ ఆ బాలికను వేధిస్తూ వస్తున్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన బాలిక కొన్నాళ్లు హైదరాబాదులోని తన బంధువుల ఇంట్లో తలదాచుకుంది. చదువు పాడవుతుందనే ఉద్దేశంతో ఆ బాలిక తిరిగి గ్రామానికి వచ్చింది. దీంతో అతను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. ఆ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు, గ్రామస్థులకు చెప్పింది. దీంతో గ్రామస్థులు అతడ్ని చితకబాదారు. అతనితో పాటు మరో ఇద్దరు ఆకతాయిలు కూడా ఉన్నారని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. సత్తార్ గ్రామంలో ఆకతాయిగా తిరుగుతుంటాడని గ్రామస్థులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+