రోశయ్య నాకు పోటీయే కాదు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రం గురించి ప్రతికూలంగా మాట్లాడే స్థితికి ముఖ్యమంత్రి కె. రోశయ్య తెచ్చారని, అది రోశయ్య అసమర్థత అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నారు. తాను ఓ పార్టీ లీడర్ ను అని, తనను శాసనసభ్యులు ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఎన్ని సార్లు కాంగ్రెసు పార్టీ చీలిపోలేదు, ఆనాడు ఇందిరా గాంధీ ఏమయ్యారని ఆయన అన్నారు. రోశయ్య గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయని, రోశయ్య తనకు పోటీ కాదని చంద్రబాబు అన్నారు. చేత కాక తనపై బురద చల్లడం, విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని ఆయన అడిగారు.

తాను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వరద బాధితులను పరామర్శించడానికి రమ్మన్నానని ఆయన అన్నారు. రోశయ్య తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదని, తాను ప్రజల గురించి మాట్లాడుతుంటే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గతంలో ఏ స్థాయిలో వచ్చారని ఆయన అడిగారు. స్థాయిల గురించి మాట్లాడడం రోశయ్య లాంటివారికి తగదని ఆయన అన్నారు. చూసి సాయం చేయడానికి రమ్మన్నానని ఆయన అన్నారు. 33 మంది ఎంపిలను గెలిపించినప్పుడు ఎందుకు సాయం చేయరని ఆయన అడిగారు. సాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఎందుకు తక్కువ నిధులిస్తున్నారని ఎందుకు అడగరని ఆయన రోశయ్యను అడిగారు.

ప్రభుత్వం ప్రజలకు సరైన న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు పౌష్టికాహారం అందించాలని ఆయన కోరారు. వరద బాధితులకు ఆహారం వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో ఎన్టీఎ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో గరిష్ట స్థాయిలో రాష్టానికి నిధులు తెచ్చామని చంద్రబాబు చెప్పారు. అప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరగలేదని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలు అసూయ పడే విధంగా పథకాలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్య పని చేయడం లేదని, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పని చేయడం లేదని, దీంతో రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. అన్ని పథకాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆయన విమర్శించారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవి కూడా కేంద్రం నుంచి రావడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వమే లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య నాయకత్వంలో విఫలమయ్యారని, నాయకత్వం వహించి సహాయ చర్యలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. వర్షాల వల్ల వరి పంటకు నష్టం వాటిల్సిందని, రైతులూ కౌలు రైతులూ తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ భూతంలా గ్రామీణ ప్రజలను పట్టి పీడిస్తోందని ఆయన అన్నారు. మద్యం వల్ల గ్రామీణులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆరోగ్యం కూడా దెబ్బ తింటోందని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+